కోలీవుడ్ అగ్ర కథానాయకుడు సూర్య (Surya) ప్రస్తుతం తెలుగు చిత్రాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆయన వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘సూర్య 46’ (Surya 46) వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో ప్రేమలు మూవీ ఫేం మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటీమణులు రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలి పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత స్వరాలు అందిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత సూర్య నటించే సినిమా ఏది అన్న అంశంపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సూర్య మరో తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.
సూర్య హీరోగా టాలీవుడ్ దర్శకుడు పరశురామ్ (Parasuram) డైరెక్షన్లో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్ పతాకంపై నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఓ సినిమా నిర్మించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే సూర్యకు పరశురామ్ ఓ కథ వినిపించారట. సూర్యకు కూడా కథ బాగా నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పారట. అయితే వెంకీ అట్లూరి సినిమా తర్వాత ఓ తమిళ సినిమాకు సూర్య (Surya) డేట్స్ ఇచ్చారు. ఆ సినిమా ముగిశాక పరశురామ్ సినిమా చేయాలని సూర్య భావిస్తున్నారట. అయితే పరశురామ్ మాత్రం వెంకీ అట్లూరితో సినిమా ముగిసిన వెంటనే తన సినిమా చేయాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారట మేకర్స్. కాగా, రెండేళ్ల కిందట విజయ్ దేవరకొండతో ద ఫ్యామిలీ స్టార్ సినిమాను తెరకెక్కించిన పరశురామ్ కు ఆశించినమేర ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోనే ఈసారైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో డైరెక్టర్ పరశురామ్ ఉన్నట్లు తెలుస్తోంది.

