గత కొన్నేళ్లుగా హిట్ మూవీ ఫ్రాంచైజీలో వస్తున్న ప్రతి చిత్రం కూడా సినీ ప్రేమికులకు మంచి వినోదాన్ని అందిస్తోంది. నాని (Natural Star Nani_ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలు ఒకటిని మించి ఇంకోటి అనేలా ఉంది. డాక్టర్ శైలేష్ కొలను (Shailesh Kolanu) దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మొదటి పార్టులో విశ్వక్ సేన్(Vishwak Sen), రెండవ పార్టులో అడివి శేష్ (Adavi Sesh) , మూడో పార్టులో నాని నటించారు. ఇందులో ‘హిట్ 2’ క్లైమాక్స్ తర్వాత సీన్లో ‘హిట్ 3’లో హీరోగా అర్జున్ సర్కార్ (Arjun Sarkar) పాత్ర నేచురల్ స్టార్ నాని చేస్తున్నట్టు రివీల్ చేశారు. ఇక ‘హిట్ 4’లో హీరోను ‘హిట్ 3’ చివర్లో చూపించారు. హిట్ 3లో నాని లీడ్ రోల్లో నటించగా.. ఇందులో కార్తీ కామియో అప్పీయరెన్స్‌లో కనిపించాడు.
అయితే ‘హిట్ 4’లో హీరోగా కార్తీ నటించనున్నాడని తెలిసిందే. హిట్ 3 రిలీజ్ సందర్భంగా హిట్ 4 హీరోని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. సీపీ వీరప్పన్ పాత్రలో కార్తీ (Karthi) ఛార్జ్ తీసుకున్నారు. త్వరలో సిల్వర్ స్క్రీన్ మీద రిపోర్ట్ చేయనున్నారు. ‘హిట్ 4’లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిగా (Chennai Super KIngs) కార్తీ సందడి చేయనున్నారు అని ప్రకటించారు మేకర్స్. ఇక ఈ హిట్-4 (HIT 4) సినిమా కోసం కార్తీ 2027లో బల్క్ డేట్స్ కేటాయించాడని, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం కార్తీ ముందస్తుగా రెమ్యునరేషన్ తీసుకోవట్లేదని సమాచారం. సినిమా లాభాల్లోకి వస్తే, అందులో తన వాటాను తీసుకుంటానని ఆయన నిర్మాత నానికి హామీ ఇచ్చినట్లు వినిపిస్తోంది. కాగా, హిట్ 4లో కార్తీ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనుండగా.. గతంలో ఆయన ఖాకీ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ గా మెప్పించిన విషయం తెలిసిందే.

