స్పీడు పెంచిన మెగా హీరో.. ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్

by | Feb 1, 2026 | సినిమా

మెగా మేనల్లుడు సాయిదుర్గతేజ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక పానిండియా పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా ‘SYG’ (సంబరాల యేటిగట్టు Sambarala Yetigattu). ఐశ్వర్యలక్ష్మి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రోహిత్‌ కె.పి తెరకెక్కిస్తున్నాడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గత కొన్నేళ్లుగా సాయిదుర్గతేజ్‌ (Sai Durga Tej) సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో సరైన బ్లాక్‌బస్టర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇక కెరీర్‌లో స్పీడ్ పెంచి వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన నిర్ణయించుకున్నారని సమాచారం. ప్రస్తుతం సాయిదుర్గతేజ్‌ ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ బ్యానర్‌లో ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘సేవ్ ది టైగ‌ర్స్‌’తో ఆక‌ట్టుకొన్న ద‌ర్శ‌కుడు తేజ కాక‌మా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగానే.. సాయిదుర్గతేజ్‌ (Sai Durga Tej) మరో కొత్త చిత్రానికి కూడా ఓకే చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను సిద్దు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ (UV Creations) సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. వీరితో పాటుగా దర్శకుడు దేవాక‌ట్టా (Deva Katta) కూడా తేజ్ కోసం ఓ క‌థ రెడీ చేస్తున్న‌ట్టు సమాచారం. మొత్తానికి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సాయిదుర్గతేజ్‌ ఈసారి పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది.