టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) , దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో మోహన్ బాబు (Mohan Babu) , సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి, కిల్ ఫేం రాఘవ్ జుయల్ కీలక పాత్రలో నటిస్తుండగా.. సోనాలి కులకర్ణి ఈ చిత్రంలో నాని (Nani) తల్లిగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఒక వైపు సుపర్ హిట్ దసరా కాంబో రిపీట్ అవడం, అలాగే జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాల తర్వాత నాని, అనిరుధ్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ‘ది ప్యారడైజ్’పై (The Paradise) అందరి దృష్టి నెలకొంది.
ఇప్పటికే విడుదలైన అప్డేట్స్, పోస్టర్లు సినిమాపై హైప్‌ను మరింత క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేస్తామని గతంలో చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే అనుకున్న తేదీకి సినిమా విడుదలవడం కష్టమేనన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యమైన షెడ్యూల్స్ మిగిలి ఉండటంతో పాటు, భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎక్కువ సమయం తీసుకునే అవకాశముంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ వర్గాల్లో మరో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. తాజా బజ్ ప్రకారం ‘ది ప్యారడైజ్’ (The Paradise) చిత్రాన్ని జూన్ 25న విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. అప్పటికి మరో నాలుగు నెలల సమయం ఉన్నందున పర్ఫెక్ట్ అవుట్‌పుట్ ఇవ్వొచ్చని, అదే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లుగా సమాచారం.

