ట్విన్స్ కు జన్మనిచ్చిన  మెగా కోడలు ఉపాసన కొణిదెల

by | Jan 31, 2026 | వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ట్విన్స్ పుట్టినట్లుగా మెగా స్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా ప్రకటించారు.  ఈ ట్విన్స్ లో ఒక బాబు, ఒక పాప పుట్టినట్లు తెలిపారు.  అంతే కాకుండా, తల్లి ఉపాసన, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి చెప్పారు.

ఈ చిన్నారులను మా కుటుంబంలోకి స్వాగతించడం నానమ్మ, తాతయ్యలు గా మాకు ఎనలేని సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా ఇది భగవంతుని ఆశీర్వాదం గా భావిస్తున్నామని చిరంజీవి అని అన్నారు

మా కోసం ప్రార్దించిన ప్రతి ఒక్కరికి,  మాపై చూపించిన ప్రేమకు, మీ దీవెనలకు, మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము

సరిగా ఫిబ్రవరి 1 అనగా అర్ధరాత్రి 12 గంటలకు మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్స్ లో ఈ విషయాన్నీ పోస్ట్ చేశారు.