India Vs New Zealand T20 Series : భారత,న్యూజిలాండ్ జట్ల మధ్య తిరువనంతపురం లో జరుగుతోన్న ఆఖరి టి 20 మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత జట్టు కు టి 20 ల లో ఇది మూడవ అత్యధిక స్కోర్. ఇషాన్ కిషన్ టి 20 ల లో తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు
ఓపెనర్ సంజు శాంసన్ 6 పరుగులే చేసి మరోసారి నిరాశపరిచాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. 48 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన దశలో వన్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) , కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) లు మూడవ వికెట్ కు 137 పరుగులు జోడించారు. సూర్య కుమార్ యాదవ్ లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సిక్సర్ల వర్షం కురిపించారు.
ఇష్ సోది వేసిన ఇన్నింగ్స్ 12 వ ఓవర్ లో ఇషాన్ కిషన్ నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్ లో ఒక వైడ్ తో కలిపి 29 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్ 14 వ ఓవర్ లో డఫీ బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. ఆ తరవాతి ఓవర్ లో సాంట్నర్ బౌలింగ్ లో కూడా సిక్స్ కొట్టిన సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 63 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సూర్య ఇన్నింగ్స్ లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి
ఇన్నింగ్స్ 17 వ ఓవర్ లో ఇషాన్ కిషన్ సాంట్నర్ బౌలింగ్ లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ 43 బంతుల్లో 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ ఇన్నింగ్స్ లో 10 సిక్సర్, 6 ఫోర్లు ఉన్నాయి. ఆ తరవాత వచ్చిన హార్దిక్ పాండ్య కూడా 17 బంతుల్లో 42 పరుగులు చేశాడు. హార్దిక్ ఇన్నింగ్స్ లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి
. భారత జట్టు ఇన్నింగ్స్ లో 23 సిక్సర్లు, 17 ఫోర్లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ ఒక్కడే 10 సిక్సర్లు కొట్టాడు. 12 అదనపు పరుగులు వైడ్, నో బాల్స్ రూపంలో లభించాయి
ఇషాన్ కిషన్ టి 20 ల లో ఆరువేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు
న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ రెండు వికెట్లు తీయగా, డఫీ, జెమీసన్, సాంట్నర్ లు తల ఒక వికెట్ తీసుకున్నారు

