‘తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’.. దుమ్మురేపిన ‘జై భీమ్‌’

by | Jan 30, 2026 | సినిమా

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ‘తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్’ను (Tamilnadu State Film Awards) తాజాగా ప్రకటించింది. ఈ అవార్డులు 2016 నుంచి 2022 వరకు విడుదలైన తమిళ సినిమాలకు మాత్రమే అందించనున్నట్లు వెల్లడించింది. ఈ అవార్డుల్లో హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘జై భీమ్’ దుమ్మురేపింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొత్తంగా ఏడు విభాగాల్లో అవార్డులు గెలుచుకుని ఆ ఏడాదిలోనే అత్యధిక పురస్కారాలు దక్కించుకున్న సినిమాగా అరుదైన ఘనత ఖాతాలో వేసుకుంది. ఉత్తమ చిత్రంతో పాటుగా ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ నేపథ్య అవార్డులు సాధించింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 13న అంగరంగ వైభవంగా నిర్వహించన్న‌ట్టు వెల్లడించింది.

‘తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్’ విజేతల వివరాలు…

2016

ఉత్తమ చిత్రం: మానగరం

ఉత్తమ నటుడు: విజయ్ సేతుపతి (Vijay Sethupathi)

ఉత్తమ నటి: కీర్తి సురేశ్ (Keerthy Suresh)

2017

ఉత్తమ చిత్రం: ఆరం

ఉత్తమ నటుడు: కార్తి (Karthi)

ఉత్తమ నటి: నయనతార (Nayanathara)

2018

ఉత్తమ చిత్రం: పరియేరుమ్ పెరుమాల్

ఉత్తమ నటుడు: ధనుష్ (Dhanush)

ఉత్తమ నటి: జ్యోతిక (Jyothika)

2019

ఉత్తమ చిత్రం: అసురన్

ఉత్తమ నటుడు: ఆర్. పార్థిబన్

ఉత్తమ నటి: మంజు వారియర్

2020

ఉత్తమ చిత్రం: కూజంగల్

ఉత్తమ నటుడు: సూర్య (Surya)

ఉత్తమ నటి: అపర్ణా బాలమురళి (Aparna Bala Murali)

2021

ఉత్తమ చిత్రం: జై భీమ్ (Jai Bheem)

ఉత్తమ నటుడు: ఆర్య (Aarya)

ఉత్తమ నటి: లిజోమోల్ జోస్

2022

ఉత్తమ చిత్రం: గార్గి

ఉత్తమ నటుడు: విక్రమ్ ప్రభు

ఉత్తమ నటి: సాయి పల్లవి (Sai Pallavi)