ఓ టి టి లో సంక్రాంతి సినిమా వినోదాల పండగ ఫిబ్రవరి లో 

by | Jan 30, 2026 | టీవీ & ఓటిటి

సంక్రాంతికి థియేటర్లలో ఐదు ఆరు సినిమాలు సందడి చేశాయి.  దాదాపుగా అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు.  అయితే థియేటర్లలో సందడి అయిపోయాక ఫిబ్రవరి లో ఓటిటి లో ఈ సంక్రాంతి సినిమాల సందడి మొదలవబోతోంది.

ముందుగా డిసెంబర్ 5 న థియేటర్లలో విడుదలైన దురంధర్ (Durandhar) ఇండియాలో నే ఒకే భాషలో 1000 కోట్లు వసూలు చేసిన మొదటి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది.  ఈ సినిమా,  ఈ రోజు నుండి నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.  థియేటర్లో హిందీ భాషలో విడుదలైన ఈ దురంధర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో మాత్రం హిందీ తో పాటు తెలుగు మరియు తమిళ బాషలలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది

ఆ తరవాత, శర్వానంద్ (Sharwanand) హీరోగా వచ్చిన నారి నారి నడుమ మురారి (Nari Nari Naduma Murari) ఈ ఫిబ్రవరి 4 నుండి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో సందడి చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది

దీని తరవాత ఫిబ్రవరి 6 నుండి డార్లింగ్ ప్రభాస్ (Prabhas) నటించిన రాజా సాబ్ (Raja Saab) జియో హాట్ స్టార్ (Jio Hot Star) లో స్ట్రీమింగ్ అవబోతోంది. ఈ మేరకు జియో హాట్ స్టార్ వారు ప్రకటించారు. రాజా సాబ్ మాత్రం దక్షిణాది బాషలలో మాత్రమే స్ట్రీమింగ్ అవబోతోంది

ఇక సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 నుండి జీ 5 (ZEE%) లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  అయితే జీ 5 గారు ఇంకా ప్రకటించాల్సి ఉంది

మీరు కూడా ప్రిపేర్ అయిపోండి. ఏ సినిమా ఏ రోజు చూడాలో.