ఓవర్సీస్ లో మన శంకర వర ప్రసాద్ గారి హవా

by | Jan 29, 2026 | సినిమా

తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’.(Mana Shankara Vara Prasad Garu) సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది.

ఈ మూవీ విడుదలైన నాటి నుంచి ట్రేడ్ వర్గాల అంచనాల్ని తలకిందులు చేస్తూ రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు సినిమాను అమితంగా ఆదరించడంతో థియేటర్లలో ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మన శంకర వర ప్రసాద్ గారు వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. ఓవర్సీస్ లో 4.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.  మెగాస్టార్ చిరంజీవి అలాగే అనిల్ రావిపూడి కెరీర్లో ఓవర్సీస్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అని చెప్పవచ్చు.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.