రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన జోరును మరింత పెంచాడు. ఒక సినిమా పూర్తయ్యాక మరో సినిమా చేసే పాత పద్ధతిని పక్కనపెట్టి, ప్రస్తుతం ఒకేసారి మూడు భారీ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ అభిమానులకు సరికొత్త జోష్ అందిస్తున్నాడు. గతేడాది ‘కింగ్డమ్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. ఈ చిత్రం అనంతరం రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్దన్’ (Rowdy Janardhan), రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ‘రణబాలి’ (Ranabaali) చిత్రాల షూటింగ్ లో ఆయన బిజీగా గడుపుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ మరో సినిమా కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం చేస్తున్న ఈ రెండు సినిమాలు కాకుండా విజయ్ దేవరకొండ (Vijay Devara Konda) మరో సినిమాను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. మనం సినిమాతో తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) తో దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ (UV Creations) సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ బల్క్ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. దాంతో విజయ్ ఒకే సమయంలో మూడు సినిమాల చిత్రీకరణలో పాల్గొననున్నాడు. ఏడాదికి కనీసం రెండు సినిమాలనైనా విడుదల చేయాలనే టార్గెట్ తో విజయ్ దేవరకొండ తన పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యున్నత సాంకేతిక విలువలతో, పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలు బాక్సాఫిస్ దగ్గర సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

