బుల్లితెర నటుడు అమర్ దీప్ హీరోగా  ‘సుమతి శతకం’ ట్రైలర్

by | Jan 29, 2026 | సినిమా

బుల్లి తెర నటుడు అమర్ దీప్ గురించి బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.  స్టార్ మా లో ప్రసారమయిన జానకి కలగనలేదు, సిరిసిరి మువ్వలు, ఉయ్యాలా జంపాల వంటి సీరియల్స్ నటించాడు. అంతే కాకుండా బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ గా నిలిచాడు.  అమర్ దీప్ మరో బుల్లి తెర నటి తేజస్విని గౌడ ని వివాహం చేసుకున్నాడు.

రవితేజ కు వీరాభిమాని అయిన అమర్ దీప్ వెండి తెరకు ‘సుమతి శతకం’ చిత్రం ద్వారా పరిచయమవుతున్నాడు.  సుమతి శతకం ట్రైలర్ విడుదలైంది

ఈ సినిమాలో శైలి చౌదరి కధానాయికగా నటిస్తోంది. ఏం ఏం నాయుడు దర్శకత్వం వహిస్తోన్న సుమతి శతకం చిత్రం ఫిబ్రవరి 6 న విడుదల అవుతోంది