దసరాకు ‘పెద్ది’ని ఢీకొట్టనున్న ‘ఫౌజీ’.!

by | Jan 29, 2026 | సినిమా

సినీ పరిశ్రమలో సంక్రాంతి తర్వాత పెద్ద బాక్సాఫీస్ సీజన్‌ దసరా పండగ అనే చెప్పొచ్చు. ఈ పండగకు వీలైనన్ని సినిమాలను విడుదల చేసి, అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ సారి దసరాకు ఏకంగా రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘పెద్ది’. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. పెద్ది (Peddi) సినిమాను తొలుత మార్చి 27న రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నారని చిత్రయూనిట్ తెలిపారు. కానీ తాజా సమాచారం ప్రకారం పెద్ది మూవీ షూటింగ్ ఇంకా పూర్తవకపోవడం, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మెరుగైన నాణ్యత కోసం ఇంకాస్త సమయం తీసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్. అందుకే, ఈ సినిమాను దసరా పండగకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ (Fouji) అనే పీరియాడిక్‌ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) తో కలిసి టి సీరిస్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపారు. మరి దసరా బరిలో నిలువనున్న ఈ రెండు చిత్రాల్లో గెలుపెవరి అనేది చూడాలి.