MSG మూవీ గ్రాండ్ సక్సెస్ – సుస్మితకు స్పెషల్ గిఫ్టిచ్చిన రామ్‌చరణ్‌

by | Jan 28, 2026 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మనశంకర వరప్రసాద్‌గారు'(Mana Shankara Vara Prasad Garu) . నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ (Venkatesh) కీలక పోషించారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి మెగా స్టార్ కెరీర్‌లోనే టాప్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన మెగాస్టార్ చిరంజీవి గారి కుమార్తె సుష్మిత కొణిదెలపై (Sushmitha Konidela) ప్రశంసల జల్లు కురుస్తుంది.

మొదట్లో చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసిన సుష్మిత ఆ తర్వాత నిర్మాతగా కెరీర్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా శంకరవరప్రసాద్‌గారుతో నిర్మాతగా భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan) త‌న సోద‌రి సుష్మితకు అదిరిపోయే కానుక ఇచ్చారట. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న సుస్మిత ఈ మేరకు వెల్లడించింది. ” ప్రతి ఏడాది రాఖీకి తమ్ముడు రామ్‌చరణ్‌ నాకు ఏదో ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తుంటాడు. మన శంకరవరప్రసాద్‌గారు మూవీ గ్రాండ్ సక్సెస్ అయ్యాక ఈవిల్‌ ఐ అనే ఒక లాకెట్‌ చైన్‌ కానుకగా ఇచ్చాడు. అక్కా నువ్వు సినిమా అద్భుతంగా నిర్మించావు. అందుకే ఇంతటి ఘన విజయం సాధించింది. ఇప్పుడు నీకు దిష్టి త‌గులుతుంది కాబ‌ట్టి ఇది వేసుకో అని రామ్ చ‌ర‌ణ్ తనకు ఈవిల్ ఐ లాకెట్‌ చైన్ కానుకగా ఇచ్చినట్లు సుస్మిత చెప్పుకొచ్చింది. కాగా, ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించిన డైరెక్టర్ అనిల్ రావిపూడికి చిరంజీవి ఖరీదైన రేంజ్ రోవర్ కారును కానుకగా అందించిన సంగతి తెలిసిందే.