‘NBK 111’ – ఇక మొదలెడదామా అంటున్న బాలయ్య!

by | Jan 28, 2026 | సినిమా

నటసింహం నందమూరి బాలకృష్ణ(Bala Krishna) , స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ల క్రేజీ కాంబినేషన్ మరోసారి పునరావృతం కానుంది. సూపర్ హిట్ చిత్రం ‘వీర సింహా రెడ్డి’ ఘన విజయం తర్వాత వీరిద్దరూ కలిసి రెండో సినిమా చేయ‌బోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన గోపీచంద్‌ మలినేని ఈ సారి పీరియాడిక్‌ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ భారీ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా లేడీ సూపర్‌స్టార్‌ నయనతార (Nayanathara) హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై సతీష్‌ కిలారు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా సెట్స్ మీద‌కి వెళ్లే సమయం వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది.

మార్చి మొదటి వారంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న‌ట్లు దర్శకుడు గోపీచంద్‌ మలినేని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘NBK 111′(NBK111) వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘మహారాజు’ (Maharaju) అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలో కనిపించనుండగా.. ఇందులో ఒకటి మహరాజు పాత్ర అని తెలుస్తోంది. అలాగే ఓ కీలక ఎపిసోడ్ లో బాలకృష్ణ యువకుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్లలోని బాలకృష్ణ లుక్స్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏదేమైనా ఈ సినిమాతో బాలకృష్ణ (Bala Krishna) మ‌రోసారి త‌నలోని న‌ట విశ్వ‌రూపాన్ని చూపించ‌బోతున్నారని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.