మొదటి భారతీయ సినిమా గా చరిత్ర సృష్టించిన దురంధర్

by | Jan 27, 2026 | సినిమా

2025 వ సంవత్సర బాలీవుడ్ కు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. చావా (Chava) , సైయారా, దురంధర్ చిత్రం లు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.

మరి ముఖ్యంగా యాక్షన్ స్పై థ్రిల్లర్ గా వచ్చిన దురంధర్ (Durandhar) సినిమా సైలెంట్ గా వచ్చి చరిత్ర సృష్టించింది. 

అక్షయ్ ఖన్నా, రణ్ వీర్ సింగ్, సారా అర్జున్ లు నటించిన ఈ దురంధర్ చిత్రానికి రచయిత, నిర్మాత, దర్శకుడు ఆదిత్య ధర్.  B62 స్టూడియోస్, జియో స్టూడియోస్ (Jio Studios) సంయుక్తంగా దురంధర్ చిత్రాన్ని నిర్మించాయి.  ఆదిత్య ధర్ (Aditya Dhar) కు దురంధర్ రెండవ సినిమా, మొదటి సినిమా ‘ఉరి’

దురంధర్ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది.  దురంధర్ ఒకే భాషలో 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన మొదటి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది.  గతంలో 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలైన బాహుబలి-2 (Bahubali), పుష్ప-2 (Pushpa) , కెజిఫ్ (KGF) 2 వంటి చిత్రాలు  సీక్వెల్స్ కావడంతో పాటు ఆయా చిత్రాల వసూళ్లు అని బాషలలో కలిపి వచ్చినవి

ప్రపంచ వ్యాప్తంగా దురంధర్ 1344.64 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా అందులో మన భారత దేశం లో 1051.14 కోట్ల గ్రాస్ వసూళ్లు ఉండగా, సుమారు 294 కోట్ల గ్రాస్ ఓవర్సీస్ వసూళ్లు ఉన్నాయి. దురంధర్ విడుదలైన ఎనిమిదవ వారంలో కూడా సుమారు 5 కోట్ల దాకా వసూలు చేసింది. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జనవరి 30 నుండి నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ ప్రీమియర్ గా స్ట్రీమింగ్ చేయనున్నారు. నెట్ ఫ్లిక్స్ కు ఉన్న గ్లోబల్ రీచ్ దృష్ట్యా దురంధర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి

భారత దేశంలో 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రాలు దురంధర్ తో పాటు  బాహుబలి-2, కెజిఫ్ 2, పుష్ప-2 మాత్రమే ఉన్నాయి.  దురంధర్ 2 ను మార్చ్ 19, 2026 న భారీగా హిందీ తో పాటు దక్షిణాది బాషలలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.