యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘దేవర 2’ కూడా ఉండటం అభిమానుల్లో భారీ అంచనాలు రేపింది. డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ తొలి భాగం సూపర్ హిట్ అవడంతో, రెండో భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొంతకాలంగా ‘దేవర 2’పై అనుమానాలు మొదలయ్యాయి. అసలు ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? దేవర 2 సెట్స్ మీదకి వెళ్తుందా ? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే శుభవార్త అందింది. ‘దేవర-2’ సినిమా ఉంటుందని ప్రొడ్యూసర్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ‘దేవర’ నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ మిక్కిలినేని దేవర 2 (Devara) సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇచ్చేశారు. తాజాగా నందిగామలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత సుధాకర్‌ను అసలు దేవర రెండో భాగం ఉంటుందా, లేదా అని ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..” దేవర- 2 (Devara) సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు. మరోవైపు అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ ఏడాది మే నెల నుంచే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం..” అని నిర్మాత సుధాకర్ ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘దేవర’కు సీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో తొలి భాగంలో తలెత్తిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకనున్నాయి. ఈ సెకండ్ పార్ట్‌లో కథానాయిక జాన్వీ కపూర్ (Jahnavi Kapoor) పాత్ర కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. అనిరుథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘దేవర 2’ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ తీరిక లేకుండా గడుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ (Dragon) అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ మే నుంచి దేవర-2 చిత్రీకరణలో పాల్గొనే అవకాశముంది.

