‘వీడీ14’ గ్లింప్స్ అదిరిపోలా.. ‘రణబాలి’ అంటూ ర‌చ్చ చేస్తున్నాడుగా.!

by | Jan 26, 2026 | సినిమా

టాలీవుడ్ లో ‘టాక్సీవాలా’ వంటి సూపర్ హిట్ తర్వాత రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) , డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ రోజు గణతంత్ర దినోత్సవం సంద‌ర్భంగా గ్లింప్స్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు మేక‌ర్స్. ఈ చిత్రాన్ని బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న‌ట్టు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘రణబాలి’ (Ranabali) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

బ్రిటీష్ వాళ్లు భారతీయులను ఎంతలా హింసించారు.. ఆ హింసకు హింసతోనే సమాధానం చెప్పే యోధుడిగా ఇందులో విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. ఇది స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే కథ. చరిత్రలో బయటకు రాని కొన్ని సంఘటనలు, దారుణాలను ఎదుర్కొనేందుకు ఒక వ్యక్తి నిలబడితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ సరసన కథానాయికగా రష్మీక మందన్న (Rashmika Mandana) నటిస్తుండగా, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. కాగా, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గత చిత్రం ‘కింగ్డమ్’ కు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమాతో ఎలాగైనా ట్రాక్ లోకి రావాలని విజయ్ దేవరకొండ చూస్తున్నాడు.