మురళి మోహన్, రాజేంద్ర ప్రసాద్ లను కలిసిన చిరంజీవి

by | Jan 26, 2026 | వార్తలు

పద్మశ్రీ వచ్చిన సందర్భంగా, మురళి మోహన్, రాజేంద్ర ప్రసాద్ లను మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సినీరంగానికి ప్రాధాన్యత దక్కిన సంగతి తెలిసిందే. భారత సినీ రంగానికి విశిష్ట సేవలు అందించిన నట దిగ్గజాలకు కేంద్రం అత్యున్నత పురస్కారాలను అందించింది. తెలుగు నటులు రాజేంద్ర ప్ర‌సాద్, ముర‌ళీ మోహ‌న్ లకు ప‌ద్మ‌శ్రీ అవార్డు దక్కింది.

ఈ సందర్భంగా చిరంజీవి స్వయంగా మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ ల ఇళ్లకు వెళ్లి శాలువా, బొకేలతో సత్కరించారు.  మురళిమోహన్, చిరంజీవి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. వీరిద్దరూ ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాలో నటించారు. అలాగే చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ లు కలిసి అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఈ మధ్య వచ్చిన సూపర్ హిట్ చిత్రం వాల్తేరు వీరయ్య సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.

ఈ చర్యతో మెగాస్టార్ చిరంజీవి తన పెద్దరికాన్ని చాటుకున్నారు. తాను ఎప్పటికి ఇండస్ట్రీ మనిషిననే విషయాన్నీ మరో సారి స్పష్టం .