పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సీనియర్ డైరెక్టర్ సురేందర్ (Surendar Reddy) కాంబోలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అతనొక్కడే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన సురేందర్ రెడ్డి ఆ తర్వాత కిక్, రేసుగుర్రం, ధృవ లాంటి సూపర్ హిట్ చిత్రాలు అందించారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లో 32వ చిత్రంగా తెరకెక్కనుండగా.. పవన్‌ను ఇంతకుముందు చూడని అత్యంత స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ లుక్‌లో చూపించబోతున్నారట. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ (Vakkantham Vamsi) కథ అందిస్తున్నారు. అయితే ఈ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచే ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎంట్రీ సీన్స్ తో పాటుగా ఇతర తారగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జైత్ర రామ మూవీస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ మిలిటరీ ఆఫీసర్ లేదా గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మారిన కొత్త లుక్ ఈ సినిమా కోసమేనని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గతేడాది ‘ఓజీ’తో రికార్డులు తిరగరాసిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో మరోసారి భారీ సర్ప్రైజ్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.

