టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్ నటిస్తోన్న పీరియాడికల్ చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. ఈ సినిమాకు హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. బ్రిటీష్ కాలం నాటి జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది 1897 – 1922 మధ్య జరిగే కథ అని తెలుస్తోంది. ఇందులో మనోజ్‌కు జోడీగా మరియా(Mariya) హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోటుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. పార్తీబన్, కాంచన ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ (Ravi Basroor) సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy) లోని మంచు మనోజ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ఈ లుక్‌ను షేర్ చేస్తూ మంచు మనోజ్ “డేవిడ్ రెడ్డి (David Reddy) బైక్ పేరు వార్ డాగ్, అతని చేతులో ఉన్న స్టిక్ పేరు డెత్ నోట్. ఇవి రెండు డేవిడ్ రెడ్డి ఆయుధాలు. ఇది నాలో ఇప్పటివరకూ బయటకు రాని ఒక వైపు. ఎలాంటి కరుణ లేని పాత్ర” అంటూ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫస్ట్ లుక్ మూవీపై ఆసక్తిని ఒక్కసారిగా పెంచేశాయి. కాగా, పాన్ ఇండియా రేంజ్లో వస్తోన్న ఈ చిత్రం కోసం మంచు మనోజ్ (Manchu Manoj) అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది.

