2025 సంవత్సరం భారతీయ సినిమా కు బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పవచ్చు. కోవిడ్ తరవాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా రారా అనే సందేహం ఉండేది. క్రమ క్రమంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం మొదలు పెట్టారు. మంచి సినిమాలను ఆదరించారు, సూపర్ హిట్ చేశారు.
ఆర్మాక్స్ మీడియా ప్రకారం, భారతీయ సినిమా గ్రాస్ బాక్స్ ఆఫీస్ ఆదాయం 2022 లో 10, 637 కోట్లు కాగా, 2023 లో 12, 226 కోట్లు, 2024 లో 11,833 కోట్లు. 2025 లో భారతీయ సినిమా గ్రాస్ బాక్స్ ఆఫీస్ ఆదాయం 13,397 కోట్లు. కోవిడ్ తరవాత ఇదే అత్యధికం.
2025 భారతీయ సినిమా గ్రాస్ బాక్స్ ఆఫీస్ ఆదాయం 13,397 కోట్లు కోట్లలో హిందీ బాషా చిత్రాలు 5505 కోట్ల వసూళ్లు సాధించి 41% షేర్ తో అగ్రస్థానంలో ఉన్నాయి. హిందీ లో సయారా, చావా, కాంతారా చాప్టర్ 1, దురంధర్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా దురంధర్ రికార్డు వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా ఇప్పటికే రికార్డులు సృష్టించింది
రెండవ స్థానంలో మన తెలుగు సినిమా సుమారు 18 శాతం తో 2377 కోట్ల వసూళ్లు సాధించింది. సంక్రాంతికి వస్తున్నాం, ఓజి చిత్రాల గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇంకా మహావతార్ నరసింహ, అవతార్ 3, కూలీ వంటి బహు బాషా చిత్రాల ప్రభావం కూడా ఉంది
తమిళ చిత్ర పరిశ్రమ 1805 కోట్ల వసూళ్లు, 13% శాతం షేర్ తో మూడవ స్థానంలో ఉంది.
నాలుగవ స్థానంలో 1400 కోట్ల వసూళ్లతో, 10% షేర్ తో అంతర్జాతీయ చిత్రాలు గ్రాస్ బాక్స్ ఆఫీస్ ఆదాయం ఉంది
సుమారు 9% శాతం షేర్, 1164 కోట్ల వసూళ్లతో మలయాళ పరిశ్రమ ఐదవ స్థానంలో ఉంది
ఇక ఆ తరవాతి స్థానంలో, కన్నడ చిత్ర పరిశ్రమ గ్రాస్ బాక్స్ ఆఫీస్ వసూళ్లు 528 కోట్లతో, 4% షేర్ కలిగి ఉంది. మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, ఇతరత్రా అన్ని బాషల గ్రాస్ బాక్స్ ఆఫీస్ వసూళ్లు సుమారు 616 కోట్లు, 4.6 శాతం
2025 లో భారతీయ బాక్స్ ఆఫీస్ గ్రాస్ వసూళ్ళలో సౌత్ ఇండియా సుమారు 44% శాతం కలిగి ఉంది
అయితే ఈ లెక్కలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టికెట్ సేల్స్ మాత్రమే. ఇవి కాకుండా టీవీ మరియు డిజిటల్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, ఓవర్సీస్ లెక్కలు అని కలిపి మన భారతీయ సినిమాలు 2025 లో సుమారుగా 21000 కోట్ల రూపాయల బిజినెస్ ను చేసిందని చెప్పవచ్చు

