మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Prasad Garu) చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi) తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు బాబీతో చేయనున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరు, బాబీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి కె (Chiranjeevi) రీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కబోయే ఈ సినిమా త్వరలోనే పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) నిర్మించనుంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘కాకా’ (Kaaka) అని లేదంటే, ‘కాకాజీ’ (Kaakaaji) అనే టైటిల్ ను ఫైనల్ చేయాలని దర్శకుడు బాబీ (Bobby) ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు, స్క్రిప్ట్ వర్క్స్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్లానింగ్ కోసం బాబీ తన బృందంతో కలిసి దుబాయ్ లో చర్చిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్, నటీనటుల వివరాలపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. కాగా, ఇది కూతురి సెంటిమెంట్‌తో ముడిపడిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలుస్తోంది.

