టాలీవుడ్ యువ హీరో నిఖిల్ (Nikhil) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’ (Swayam Bhu) భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నిఖిల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడికల్ సబ్జెక్ట్‌తో వస్తున్న సినిమా కావడంతో చాన్నాళ్లుగా చిత్రీకరణ జరుపుకొంటోంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో మేకర్స్ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ గురించి సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా తాజాగా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది. ముందుగా ఈ చిత్రాన్ని మహాశివరాత్రి (Maha Shiva Ratri) కానుకగా ఫిబ్రవరి 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా చాలానే ఉండటంతో ‘స్వయంభు’ (Swayambhu) సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. కాగా, ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ ఆ తర్వాత ‘స్పై’, ’18 పేజీస్’ సినిమాలు చేశాడు. కానీ అవి ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. ఈ క్రమంలోనే ‘స్వయంభు’ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

