తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కథానాయకుడిగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో వస్తున్న ఆసక్తికర చిత్రం ‘స్లమ్ డాగ్’. ‘33 టెంపుల్ రోడ్’ (Slum Dog) అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటించగా, టబు, ‘దునియా’ విజయ్ కుమార్ (Duniya Vijay) కీలక పాత్రల్లో నటించారు. పూరి కనెక్ట్స్, (Puri Connects) జెబి మోహన్ పిక్చర్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ‘దునియా’ విజయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రఫ్ లుక్‌లో కనిపించారు విజయకుమార్. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని పూరి జగన్నాథ్ తెలిపారు.
అంతకుముందు విజయ్ సేతుపతి పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ లో బిచ్చగాడిగా కళ్లజోడు పెట్టుకొని, చేతిలో రక్తంతో తడిచిన కత్తి పట్టుకొని సీరియస్ లుక్ లో కనిపించారు. ఇందులో విజయ్ సేతుపతి పాత్రకు మూడు విభిన్న కోణాలు ఉంటాయని, అందులో ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాల ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ (Harsha Vardhan Rameswar) ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

