స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF)లో ఓ ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఈ సమావేశాల్లో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) పాల్గొనడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఫ్యామిలీ ట్రిప్ లో భాగంగా స్విట్జర్లాండ్‌లో ఉన్న చిరంజీవిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దావోస్ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే సీఎం ఆహ్వానం మేరకు మెగాస్టార్ చిరంజీవి ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ (Telangana Rising) విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రితో పాటుగా ఇతర మంత్రుల బృందంతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చిరంజీవి వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో చర్చించారు.
ప్రపంచ ఆర్థిక వేదిక(WEF) వేదికగా తెలంగాణ తన సత్తా చాటుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పలు కీలక ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా.. అంతర్జాతీయ వేదికపై ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌నూ ఆవిష్కరించింది. ఇక మరోవైపు చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమా విజయంపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సినిమా గురించి చిరుతో చాలాసేపు ముచ్చటించారు. కాగా, సంక్రాంతి కానుకగా వచ్చిన చిరు ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్లో చేరిన ప్రాంతీయ సినిమాగా నిలువడమే కాకుండా చిరంజీవి కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

