దేశంలోని వివిధ సినీ పరిశ్రమలో అత్యంత ఆదరణ కలిగిన నటులు ఎవరనే అంశంపై ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఆర్మాక్స్ మీడియా’ ప్రతీ ఏడాది చివర్లో సర్వే నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2025 డిసెంబర్ లో ఆర్మాక్స్ సంస్థ సర్వే ప్రకారం పది మంది టాప్ హీరోలు, పది మంది టాప్ హీరోయిన్స్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం డిసెంబర్-2025లో ఇండియాలో అత్యంత ఆదరణ ఉన్న హీరోల్లో మొదటి ప్లేస్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) చోటు దక్కించుకున్నారు.
వీరిద్దరి తర్వాత మూడో ప్లేస్లో షారుఖ్ ఖాన్ ఉండగా.. నాలుగో ప్లేస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఉన్నారు. ఆ తర్వాత ఐదో స్థానంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నిలువుగా.. ఆరో స్థానంలో తమిళ స్టార్ హీరో అజిత్ ఉన్నారు. ఇక ఏడో ప్లేస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నిలవగా.. ఎనిమిదో స్థానాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) దక్కించుకున్నారు. ఇక తొమ్మిది, పది స్థానాల్లో వరుసగా బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ నిలిచారు. ఇలా ఆర్మాక్స్ టాప్ 10 హీరోల జాబితాలో ఐదుగురు టాలీవుడ్ హీరోలు స్థానం దక్కించుకోవడం విశేషం.
ఆర్మాక్స్ సంస్థ టాప్ 10 హీరోయిన్స్- 2025 లిస్ట్ లో సమంత (Samantha) అగ్ర స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రెండో స్థానంలో అలియా భట్, మూడో స్థానంలో రష్మిక మందన్నా, నాలుగో స్థానంలో దీపికా పదుకోణె నిలిచారు. ఇక ఐదో ప్లేస్ లో నయనతార ఉండగా.. ఆరో స్థానంలో కాజల్ అగర్వాల్ ఏడో స్థానంలో త్రిష నిలిచారు. ఇక ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలను సాయిపల్లవి, అనుష్క, శ్రీలీల వరుసగా కైవసం చేసుకున్నారు. కాగా, ఆర్మాక్స్ సంస్థ ఈ జాబితాలను హీరో, హీరోయిన్ల క్రేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆధారంగానే వెల్లడించినట్లు ప్రకటించింది.


