ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ ఫ్రాంచైజీతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) , రష్మిక మందన్నా (Rashmika Mandana) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. పుష్ప (Pushpa) మూవీ 2021లో రిలీజవగా పుష్ప 2 సినిమా 2024లో విడుదలైంది. వీటిలో పుష్ప మూవీ రూ.350 కోట్లకు పైగా వసూలు చేయగా.. పుష్ప 2 సినిమా రూ.1650 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఈ క్రమంలోనే పుష్ప 2కి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. దాంతో కొంతకాలంగా ‘పుష్ప 3’ (Pushpa) సినిమా ఎప్పుడు మొదలవనుంది? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప 3 చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పుష్ప 3 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ సైలెంట్ గా జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆఫీసులో సుకుమార్ (Sukumar) తన టీమ్ తో కలిసి స్టోరీని మరింత పవర్ ఫుల్ గా రూపొందిస్తున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో తన 22వ సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. అలాగే లోకేష్ కనగరాజ్‌తో కూడా ఓ ఓ సినిమా లైనప్‌లో ఉంది. మరి అల్లు అర్జున్ ఈ సినిమాలు పూర్తయ్యాక పుష్ప 3 సెట్స్ లో చేరతాడా లేదంటే ముందుగానే జాయిన్ అవుతాడా అనేది తెలియాల్సి ఉంది.

