శర్వానంద్ నెక్ట్స్ మూవీ ఫిక్స్.. రంగంలోకి ఆ స్టార్ డైరెక్టర్‌!

by | Jan 17, 2026 | సినిమా

ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ వద్ద సినిమాల పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈసారి సంక్రాంతికి రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, మాస్ మహారాజ రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ వంటి పెద్ద సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ, వీటన్నింటినీ దాటేసి యువ కథానాయకుడు శర్వానంద్ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ (Naari Naari Naduma Murari) మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. పండుగ సీజన్‌కు తగ్గట్లుగా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను ఆకట్టుకునేలా తెరకెక్కిన ఈ మూవీ విడుదలైనప్పటి నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

ఈ క్రమంలోనే తాజాగా హైద్రాబాద్ లో సక్సెస్ మీట్‌ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్‌ (Sharwanand) మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.. ‘నారి నారి నడుమ మురారి’ మూవీ తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పారు. “ డైరెక్టర్ ఈ మూవీ స్క్రిప్ట్ చెప్పగానే ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్మకం కలిగింది. రిలీజ్ డేట్ ఏదైనా కూడా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరోసారి రుజువైంది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో నా తదుపరి సినిమా రానుంది. ఈ చిత్రాన్ని కూడా వచ్చే సంక్రాంతికే తీసుకోస్తాం అని” శర్వానంద్ చెప్పుకొచ్చారు. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌గా ఓ వెలుగు వెలిగిన‌ శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హీరో శర్వానంద్ కి శ్రీను వైట్ల కథ వినిపించారట. శ్రీను వైట్ల మార్క్‌తో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ స్క్రిప్ట్ శర్వానంద్‌కు తెగ నచ్చిందట. దాంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.