క‌ళ్లు బ‌య‌ర్లు క‌మ్మేలా ‘అనగనగా ఒక రాజు’ క‌లెక్ష‌న్స్.!

by | Jan 17, 2026 | సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్‌ పొలిశెట్టి, బ్యూటీ క్వీన్ మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నూతన దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 14న భారీ ఎత్తున రిలీజ్ అయింది. మూవీ ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగాయి. ట్రైల‌ర్ చూసే మూవీ సూప‌ర్ హిట్ అవుతుంద‌నే అంచ‌నాకి వ‌చ్చారు అభిమానులు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. తనదైన కామెడీ టైమింగ్, పంచులతో నవీన్ పొలిశెట్టి ప్రేక్ష‌కులకి మంచి మ‌జాని అందించాడు. ఈ క్రమంలోనే సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

‘అనగనగా ఒక రాజు’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ దుమ్మురేపుతోంది. ప్రీ బుకింగ్స్ లోనే జోరు చూపించిన ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే ఊపు కొనసాగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే రూ.50 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. తాజా సమాచారం ప్రకారం, మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా మొత్తంగా రూ.61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు నిర్మతలు అధికారికంగా ప్రకటించారు. మేకర్స్ వదిలిన ఈ కలెక్షన్ పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ లెక్కన ఆదివారం నాడు మరింతగా కలెక్షన్స్ పెరిగే అవ‌కాశం ఉంది. వీకెండ్‌లోనే ఈ సినిమా వంద కోట్ల మార్క్ చేరుకుంటుంద‌ని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.