సంక్రాంతి విజేత ఎవరు.. బరిలో ఉన్న సినిమాల పరిస్థితి ఏంటి.?

by | Jan 17, 2026 | సినిమా

తెలుగు చిత్రసీమకు సంక్రాంతి సీజన్‌ అంటే చాలా స్పెషల్‌ అని చెప్పొచ్చు. సినీ ప్రేమికులకు వరుసగా సెలవులు ఉంటాయి కాబట్టి దాదాపు అన్ని సినిమాల కలెక్షన్లు బాగుంటాయి. ప్రతిసారీలాగే ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అయితే అందులో అందరి చూపు ‘మన శంకరవరప్రసాద్’ పైనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనుకున్నట్లుగానే కలెక్షన్ల ప్రవాహం కురిపిస్తోంది. ఐదు రోజుల్లోనే 226 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ పండక్కి ‘మన శంకరవరప్రసాద్’ తో పాటు మరో నాలుగు సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో ఏది నంబర్ వన్ అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజాసాబ్’ సినిమా జ‌న‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. మొదటి వారంలోనే రూ.238 కోట్ల‌కు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

ఇక మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా విడుదలైన మొదటి 4 రోజుల్లో సుమారు రూ.8.60 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.42 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అలాగే యువ హీరో శర్వానంద్ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ మూవీ విడుదలైన అన్ని కేంద్రాల్లో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే మొదటి మూడు రోజుల్లో సుమారు రూ.5.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. వీటన్నిటి కలెక్షన్లను పరిశీలిస్తే.. ఓవరాల్‌గా ఎటు చూసుకున్న ఈ సంక్రాంతి విజేతగా ‘మన శంకరవరప్రసాద్’ (Mana Shankara Vara Prasad) నిలిచాడని చెప్పొచ్చు.