ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ (Guna Sekhar) తెరకెక్కించిన తాజా చిత్రం ‘యుఫోరియా’. ఇటీవల ‘ధురంధర్’ సినిమాతో కథానాయికగా ఆకట్టుకున్న సారా అర్జున్ (Sara Arjun) ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భూమిక (Bhoomika), గౌతమ్ వాసుదేవ్ మేనన్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లికితా యలమంచిలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ (Kaala Bhairava) సంగీతం అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా గుణ శేఖర్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. రుద్రమదేవి, శాకుంతలం లాంటి భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఈయనకు కలిసి రాలేదు. దీంతో కాస్త విరామం తీసుకుని ‘యుఫోరియా’ అనే యుత్‌ఫుల్ సినిమా తీశారు.
ఈ సినిమా ఫిబ్రవరి 06న విడుదల కానుండగా.. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక ఈవెంట్లో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. యువత మత్తు పదార్థాల భారిన పడటం ఎలాంటి పర్యావసానాలకు దారితీసిందనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సివిల్స్ సాధించాలి అనుకున్న అమ్మాయిపై డ్రగ్స్ మత్తులో ఓ యువకుడు అత్యాచారానికి పాల్లడినట్లు ట్రైలర్లో చూపించారు. దర్శకుడు గుణశేఖర్ తన కెరీర్లో ఇప్పటివరకు టచ్ చేయని సరికొత్త పాయింట్ తో ‘యుఫోరియా’ (Euphoria) రాబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

