Mana Shankara Vara Prasad మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వెంకటేష్ లతో అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేసిన మేజిక్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. 2026 సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామి సృష్టిస్తోన్న మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం లో ఉన్న కొన్ని ఆసక్తికర అంశాల గురించి తెలుసుకుందాం
మన శంకర వర ప్రసాద్ చిత్రం లో నాలుగు దక్షిణ భారత దేశ రాష్ట్రాలను చూపించారు. ఆయా బాషలలో కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ బాషలలో డైలాగ్స్, సన్నివేశాలు ఉన్నాయి. చిరంజీవి, నయనతారను కలిసేది కేరళలోనే. అలాగే ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) వెంకీ గౌడ అనే పాత్రలో మెరిశారు. కర్ణాటకలో పెద్ద బిజినెస్ మాన్. వెంకటెష్ కన్నడలో కొన్ని డైలాగ్స్ కూడా చెప్పారు. అలాగే ఒక తమిళ ఫ్యామిలీ తో కొన్ని హాస్య సన్నివేశాలు కూడా ఉన్నాయి. అలా తెలుగు తో పాటు నాలుగు దక్షణాది భాషలను ఈ చిత్రంలో చూపించారు
మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలో చిరంజీవి పాత సినిమా రిఫరెన్స్ లు అనేకం ఉన్నాయి. అవేంటో చూసేద్దాం
గ్యాంగ్ లీడర్ సినిమా లో ఇంటర్వెల్ సీన్ లో గోడను బద్దలు కొట్టే తరహా సన్నివేశం
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రంలో హీరోయిన్ విజయ శాంతి పేరు శశిరేఖ. అంతే కాకుండా విజయ శాంతిని రేఖ నా శశిరేఖ అని పిలుస్తాడు చిరంజీవి. మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలో నయన తార పేరు కూడా శశిరేఖ. ఇక్కడ కూడా ఒక సన్నివేశంలో రేఖ నా శశిరేఖ అని పిలుస్తాడు
గ్యాంగ్ లీడర్ సినిమాలో మొదటి పెట్టాలో స్టార్ట్ మ్యూజిక్ అని అంటాడు చిరంజీవి. అదే విధంగా మన శంకర వర ప్రసాద్ చిత్రంలో చిరంజీవి మొదటి పాటకు ముందు స్టార్ట్ మ్యూజిక్ అని అంటారు
చిరంజీవి నటించిన చంటబ్బాయి చిత్రంలో హీరోయిన్ సుహాసిని పేరు జ్వాల. మన శంకర వర ప్రసాద్ చిత్రం లో చిరంజీవి టీం లో ఉన్న క్యాథెరిన్ పేరు జ్వాల
చిరంజీవి అడవికి వెళ్ళినప్పుడు పులి ని ఛాలెంజ్ సినిమాలోని ఇందువదన పాట పాడడం. ఈ సీన్ హైలైట్ అని చెప్పవచ్చు
మన శంకర వర ప్రసాద్ సినిమా లో వెంకటేష్ చిరంజీవి నటించిన రామ్మా చిలకమ్మా, నవ్వింది మల్లెచెండు పాటలకు డాన్స్ చేయడం
ఇంకా ఈ సినిమాలో చిరంజీవి నటించిన అన్నయ్య, జై చిరంజీవ సినిమాలలో చిరంజీవి ఎనర్జీ కనపడుతుంది.
అంతే కాక మన శంకర వర ప్రసాద్ చిత్రం ప్రారంభంలో మెగా స్టార్ చిరంజీవి అని 25 ఏళ్ళ క్రితం ఎలా వేశారో ఆలా వేశారు. పైగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఘరానా మొగుడు సినిమాది. మొత్తానికి అనిల్ రావిపూడి వింటేజ్ చిరంజీవి ని తీసుకువచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తోన్న మెగా అభిమానుల ఆకలి తీర్చారు అని చెప్పారు. మన శంకర వర ప్రసాద్ గారు చూడకపోతే చూడండి. ఇప్పటికే చూస్తే మరోసారి చూడండి


