మెగాస్టార్ ర్యాంపేజ్.. బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తున్నాడుగా!

by | Jan 17, 2026 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి కథాయకుడిగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మనశంకర వరప్రసాద్‌గారు’. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ కీలక పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి స్టోరీకి జతగా చిరంజీవి గ్రేస్, వెంకటేష్ స్పెషల్ ఎంట్రీ తోడవడంతో థియేటర్లు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి. ఇటీవల కాలంలో చిరంజీవి సినిమాకు ఈ రేంజులో కలెక్షన్స్‌ రాలేదు. ఈ సినిమా ద్వారా చిరు మళ్ళీ ఫామ్‌లోకి వచ్చారని మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఇది వరుసగా తొమ్మిదవ హిట్ కావడం విశేషం.

ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే.. రిలీజైన తొలి రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టిన ‘మనశంకర వరప్రసాద్‌గారు’ ఇప్పుడు ఐదు రోజుల్లోనే రూ.226 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లోను ‘మన శంకరవరప్రసాద్’ గారుకి అద్భుత స్పందన లభిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటగా.. తాజాగా 2.5 మిలియన్ ఫీట్ ని కూడా దాటేసి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన సినిమాగా నిలిచింది. దాంతో ఈ చిత్రం లాంగ్ రన్​లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా.. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు.