ఉమెన్ ప్రీమియర్ లీగ్ (Women Premiere League) లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఉమెన్, యూపీ వారియర్స్ ఉమెన్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఉమెన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ (UP Warriors) నిర్ణీత 20 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.
కెప్టెన్ లానింగ్ 14 పరుగులు, హర్లీన్ డియోల్ 11 పరుగులు, .లిచ్ ఫీల్డ్ 20 పరుగులు,కిరణ్ నవగిరే 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. శ్వేతా సెహ్రావత్ డక్ అవుట్ అయ్యారు
ఒకానొక దశలో, 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడిన యూపీ వారియర్స్ ను దీప్తి శర్మ, డాటిన్ లు సమయోచితంగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జట్టుకు 143 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను అందించారు. దీప్తి శర్మ 45 పరుగులు, డాటిన్ 40 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరూ ఐదవ వికెట్ కు 93 పరుగులు జోడించారు
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (Royal Challengers, Bangalore) బౌలర్లలో శ్రేయాంక పాటిల్, క్లర్క్ లు చెరో రెండు వికెట్లు తీశారు. లారెన్ బెల్ ఒక వికెట్ తీసుకుంది

