ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఉమెన్, యూపీ వారియర్స్ ఉమెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో యూపీ వారియర్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
144 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కు ఓపెనర్లు గ్రేస్ హారిస్, స్మ్రితి మందన లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా గ్రేస్ హారిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. కేవలం 40 బంతుల్లో 85 పరుగులు చేసింది. హారిస్ ఇన్నింగ్స్ లో 5 సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి. మరో వైపు స్మ్రితి మందన సైతం బ్యాట్ ఝుళిపించింది. మందన 32 బంతుల్లో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచింది
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు 144 పరుగుల లక్ష్యాన్ని 12.1 ఓవర్లలో కరిగించేశారు.
అంతకు ముందు టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ ఉమెన్ నిర్ణీత 20 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.
కెప్టెన్ లానింగ్ 14 పరుగులు, హర్లీన్ డియోల్ 11 పరుగులు, .లిచ్ ఫీల్డ్ 20 పరుగులు,కిరణ్ నవగిరే 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. శ్వేతా సెహ్రావత్ డక్ అవుట్ అయ్యారు
ఒకానొక దశలో, 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడిన యూపీ వారియర్స్ ను దీప్తి శర్మ, డాటిన్ లు సమయోచితంగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జట్టుకు 143 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను అందించారు. దీప్తి శర్మ 45 పరుగులు, డాటిన్ 40 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరూ ఐదవ వికెట్ కు 93 పరుగులు జోడించారు
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్, క్లర్క్ లు చెరో రెండు వికెట్లు తీశారు. లారెన్ బెల్ ఒక వికెట్ తీసుకుంది

