టాప్ టెన్ ధనిక నటుల జాబితా India 2025 లో రామ్ చరణ్!

by | Jan 6, 2026 | వార్తలు

సోషల్ మీడియాలో ఒక వార్త హడావిడి చేస్తోంది. అదేంటంటే 2025 సంవత్సరానికి సంబంధించి ఇండియా లోనే సంపన్నులైన టాప్ టెన్ నటుల జాబితా ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ వార్త నేషనల్ మీడియా నుండి మన సౌత్ కి వచ్చింది. ఈ వార్తకు ఆధారం ఒక్కొక్కరు ఒక్కో రకంగా రాస్తున్నారు.

అయితే ఈ జాబితా ప్రకారం 2025 సంవత్సరానికి సంబంధించిన టాప్ టెన్ సంపన్నులైన నటుల జాబితాలో మన తెలుగు నటులు నలుగురు ఉండడం విశేషం.

అక్కినేని నాగార్జున 5000 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. బిజినెస్ నాలెడ్జి ఎక్కువగానే ఉంది మన నాగార్జునకు. నటుడు, నిర్మాత, స్టూడియో అధినేత, ఒకప్పుడు మా టీవీ లో ఇన్వెస్ట్ చేశారు కూడా. ప్రస్తుత స్టార్ మా లో వస్తోన్న బిగ్ బాస్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 9 కి నాగార్జున పారితోషికం సుమారు 30 కోట్లు అని తెలుస్తోంది

ఈ జాబితాలో ఏడవ స్థానంలో మన శంకర వర ప్రసాద్ గారు ఉన్నారు. 1750 కోట్లతో మెగా స్టార్ చిరంజీవి 7వ స్థానంలో ఉన్నారు. చిరంజీవి కూడా గతంలో నాగార్జున తో పాటు మా టీవీ లో , స్పోర్ట్స్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. సినిమా రంగంలో 47 సంవత్సరాలనుండి ఉన్నారు. అంతే కాక ఏం ఎల్ ఏ గా, కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. ఇవే కాక ప్రకటనలలో నటించడంతో పాటు కొన్ని టీవీ షో లు కూడా చేశారు

ఇక ఇదే జాబితాలో విక్టరీ వెంకటేష్ 9వ స్థానంలో ఉన్నారు. 1650 కోట్లతో వెంకటేష్ ఈ జాబితాలో చోటు సంపాదించారు. శతచిత్ర నిర్మాత డి రామా నాయుడు కొడుకుగా, సుదీర్ఘ నట ప్రస్థానం, ఫిలిం ప్రొడక్షన్, స్టూడియో, బిజినెస్ లు ఉన్నాయి. ప్రస్తుతం వెంకటేష్, చిరంజీవి కలిసి మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో నటించడం విశేషం. వీరిద్దరూ ఈ జాబితాలో ఉండడం మరో విశేషం.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జాబితాలో, తరవాతి తరం నటులలో రామ్ చరణ్ మాత్రమే పదవ స్థానంలో ఉన్నారు. రామ్ చరణ్ ఆస్తుల విలువ 1630 కోట్లుగా ఉంది. ఆర్ ఆర్ ఆర్ తో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన రామ్ చరణ్ సినిమాలతో, నిర్మాతగా, బ్రాండ్ ఎండార్స్మెంట్ లు చేస్తూ ఉన్నారు. కేవలం 17 సినిమాలలో నటించాడు రామ్ చరణ్. మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అంతే కాకుండా హైదరాబాద్ పోలో & రైడింగ్ క్లబ్ లో పెట్టుబడులు పెట్టాడు. భార్య ఉపాసన ద్వారా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ తో కూడా సంబంధాలు ఉన్నాయి.

సినిమా నటులకు ఛరిష్మాతో పాటు డబ్బు కూడా వస్తుంది. వీరందరూ బ్రాండ్ పవర్ హౌస్ గా ఎదిగారు.