టాక్సిక్ సినిమాలో ఆరుగురు హీరోయిన్లా!

by | Jan 6, 2026 | సినిమా

కే జి ఎఫ్ సిరీస్ తరవాత యష్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్.  ఈ చిత్రానికి  ‘A Fairy Tale for Grown-Ups’ అనేది ఉప శీర్షిక

టాక్సిక్ చిత్రం మార్చ్ 19, 2026 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్రం బృందం ఇప్పటికే ప్రకటించింది.  కె వి యెన్ ప్రొడక్షన్స్ ఈ టాక్సిక్ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో నయనతార గంగ పాత్రలో నటిస్తుండగా, నదియా పాత్రలో కియారా అద్వానీ, మెలిసా పాత్రలో రుక్మిణి వసంత్, ఎలిజబెత్ పాత్రలో హుమా ఖురేషి, రెబెకా పాత్రలో తారా సుతారియా నటిస్తున్నారు.  ఈ ఐదుగురు అందాల భామలు టాక్సిక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఐదుగురు పాత్రలకు సంబందించిన స్టిల్ ఒకదాని తరవాత ఒకటి ఇప్పటికే వదిలారు చిత్ర నిర్మాతలు

పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ టాక్సిక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది మలయాళం చిత్ర పరిశ్రమకు చెందిన నటి మరియు దర్శకురాలు అయిన గీతూ మోహన్ దాస్.

యష్ నటిస్తోన్న ఈ టాక్సిక్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.