యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోన్న ఐదవ టెస్ట్ లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసింది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ వన్ డే తరహాలో ఆడి కేవలం 166 బంతుల్లో 163 పరుగులు చేశాడు. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 129 పరుగులతో , వెబ్ స్టర్ 42 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకు ముందు లబుషేన్ 48 పరుగులు, గ్రీన్ 37 పరుగులు చేసి ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించడానికి దోహద పడ్డారు
ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్ మూడు వికెట్లు తీయగా, కెప్టెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీశాడు. టంగ్, బెథెల్ లు చెరో ఒక వికెట్ తీశారు.
అంతకు ముందు ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్ లో 384 పరుగులకు అల్ అవుట్ అయిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో జో రూట్ 160 పరుగుల తో కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా చేతిలో 3 వికెట్లు ఉన్నాయి. కెప్టెన్ స్టీవ్ స్మిత్, వెబ్ స్టర్ లు క్రీజ్ లో ఉన్నారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది.
ఇప్పటికే 1-3 తో సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుకు ఈ మ్యాచ్ లో ఓటమిని తప్పించుకుకోవాలంటే నాలుగవ రోజు ఉదయం ఆస్ట్రేలియా మిగిలిన మూడు వికెట్లను త్వరగా తీయాలి. ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ లో ఎవరో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడాలి

