ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం పై అభిమానుల అంచనాలు తారాస్థాయికి వెళ్లాయి. జనవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా రాజా సాబ్ విడుదలవుంతోంది. ముందు రోజు అంటే జనవరి 8 న ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు.
రాజాసాబ్ చిత్రంలో రిద్ది, మాళవిక మోహన్, నిధి అగర్వాల్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ ఆడి, పాడిన ‘నాచె నాచె’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘డిస్కో డాన్సర్’ సినిమాలోని పాటను రీమిక్స్ చేశారు
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వ ప్రసాద్ ఈ చిత్రంని నిర్మిస్తూన్నారు. థమన్ ఈ చిత్రానికి స్వర సారధ్యం వహిస్తున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహించారు.

