‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ విడుదల

by | Jan 4, 2026 | సినిమా

‘Mana Shankara Vara Prasad Garu’  చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో ఎస్ వి సినీప్లెక్స్ లో జరిగింది. ఈ ట్రైలర్ నిడివి రెండు నిమిషాల 30 సెకండ్లు ఉంది.  ట్రైలర్ చివర్లో వెంకటేష్, చిరంజీవి ల మధ్య సంభాషణలు చాలా బాగున్నాయి.  మీరు ట్రైలర్ చూసేయండి

మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలో చిరంజీవి నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.  ఆయన స్క్వాడ్ లో  క్యాథెరిన్ థెరిసా, హర్ష వర్ధన్, అభినవ్ గోమఠం లు ఉన్నారు. 

మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) అతిధి పాత్రలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.  20-25 నిమిషాల పాటు కనిపించే వెంకటేష్ పాత్రకు ఒక పాట, ఒక ఫైట్ అండ్ కొన్ని  ముఖ్య సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది

మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 7 జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే రోజు చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ ను విడుదల చేసే అవకాశం ఉంది

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  భీమ్స్ ఈ చిత్రానికి స్వర సారధ్యం వహిస్తున్నారు.  జనవరి 12 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.  జనవరి 11 రాత్రి నుండి ప్రీమియర్ సందడి మొదలవుతోంది.