అఖండ 2 విడుదల తేదీ ఖరారు

by | Jan 4, 2026 | టీవీ & ఓటిటి

బాల కృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2 ఓ టి టి లో విడుదల చేయడానికి నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోంది.  ఈ మేరకు సంక్రాంతి కానుకగా జనవరి 9 నుండి ఓ టి టి లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది

.అఖండ 2 గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం అఖండ కు సీక్వెల్.  అయితే అఖండ 2 ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చింది

అఖండ 2 లో సనాతన ధర్మం ఎపిసోడ్ లకు ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి స్పందన లభించింది. అయితే ఓవర్ ది డోస్ యాక్షన్ సీన్లు, చిత్రం సీరియస్ గా కొనసాగడం వంటి అంశాలు సగటు ప్రేక్షకకుడిని నిరాశపరిచాయి.

అఖండ 2 థియేటర్లలో డిసెంబర్ 12 న విడుదల అయ్యింది.  డిసెంబర్ 12 నుండి జనవరి 9 వరకు పెద్ద హీరోల సినిమాల రిలీజ్ లు ఏమి లేవు  సినిమా యావరేజ్ గా ఉన్నా వసూళ్ల పరంగా రికార్డు సృష్టించే అవకాశాన్ని బాల కృష్ణ, బోయపాటి శ్రీను వదులుకున్నారు.  గతంలో ఇలాంటి సమయంలోనే టికెట్ రేట్లు భారీగా పెంచుకుని విడుదలైన పుష్ప-2 రికార్డు వసూళ్లను సొంతం చేసుకుంది.  బాలయ్య, బోయపాటి లు సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నారు. 

ఆ తరవాత వచ్చిన చిన్న సినిమాలు ఛాంపియన్, శంబాలా చిత్రం మంచి వసూళ్లను నమోదు చేసుకున్నాయి.

ఇప్పుడు థియేటర్ లో చూడని వారు నెట్ ఫ్లిక్స్ లో జనవరి 9 న చూసి ఆనందించండి.  అదే రోజు డార్లింగ్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ థియేటర్లలో సందడి చేయడానికి వస్తోంది.