స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 9 రికార్డు స్థాయి రేటింగ్ పాయింట్ లను సాధించింది. ఈ సారి బిగ్ బాస్ సీజన్ 9 విజేత కామన్ మాన్ గా కళ్యాణ్ పడాల అని మనందరికీ తెలిసిందే. తనూజ రన్నర్ అప్ గా నిలిచారు.
సుమారు 115 రోజులుగా బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. బిగ్ బాస్ తెలుగులోనే కాదు కన్నడ భాషలోనూ రికార్డు స్థాయి రేటింగ్స్ ను సాధిస్తోంది. బాషా ఏదైనా బిగ్ బాస్ అనే ఈ రియాలిటీ షో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది
స్టార్ మా లో ప్రసార మైన బిగ్ బాస్ ఫినాలే గత ఐదు సీజన్లతో పోలిస్తే అత్యధికంగా 19.6 రేటింగ్ పాయింట్లను సాదించినట్లుగా స్టార్ మా ప్రకటించింది. బిగ్ బాస్ షో కి, తొమ్మిది సీజన్లు అయినా ప్రేక్షకాదరణ పెరుగుతోంది కానీ తగ్గట్లేదు
బిగ్ బాస్ షో హోస్ట్ గా నాగార్జున కూడా 100% న్యాయం చేస్తున్నాడు. గతంలో ఎన్టీఆర్, నాని లు కూడా చేసిన నాగార్జున చేసినట్లుగా మిగతా హీరోలు చేయలేకపోయారు. బిగ్ బాస్ షో లో కొత్త సినిమా ప్రొమోషన్స్ కూడా చేసుకోవచ్చు. కంటెంట్ పరంగా, మార్కెటింగ్ పరంగా బిగ్ బాస్ వేదిక పెద్దదనే చెప్పాలి
అయితే ఈ సారి తొమ్మిదవ సీజన్లో కామన్ పబ్లిక్ నుండి కొంత మందిని ఎంపిక చేసి జియో హాట్ స్టార్ లో ప్రత్యేక ఎపిసోడేలు చేశారు. ఈ ఎపిసోడ్ ల నుండి అనేక టాస్క్ ల ద్వారా కొంత మందికి నేరుగా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించారు. అలా వచ్చినా కామన్ మాన్ మన బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల.
కలర్స్ టీవీ లో ప్రసారమైన హిందీ బిగ్, ఆసియానెట్ లో ప్రసారమైన మలయాళం బిగ్ బాస్ సీజన్ లు కూడా రికార్డు స్థాయి రేటింగ్స్ ని సొంతం చేసుకున్నాయి
ఛానల్ యాజమాన్యాలకు కూడా ఇలాంటి షో లు చేయడం వలన రేటింగ్స్ గ్యారంటీగా వస్తున్నాయి. ఇలాంటి అంతర్జాతీయ షో లు చేయడం ఖర్చుతో కూడుకున్న పని అయినా, ఛానల్ యజమాన్యాలమీద కంటెంట్ పరంగా ఒత్తిడి తగ్గుతుంది.

