సైలెంట్ గా వచ్చి ‘పుష్ప 2’ రికార్డు ఎసరు పెడుతోన్న ‘దురంధర్’

by | Jan 3, 2026 | సినిమా

డిసెంబర్ 5, 2024 లో పుష్ప 2 (Pushpa 2) విడుదలయింది.  తెలుగు సినిమా హిందీ భాషలో 836 కోట్ల నెట్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.  పుష్ప 2 తరవాత సరిగా సంవత్సరానికి అంటే 2025 లో  అదే డిసెంబర్ 5 న విడుదలైన దురంధర్ కూడా 800 కోట్ల క్లబ్ లో చేరబోతోంది.

సినిమా విడుదలైన నాలుగవ వారంలో దురంధర్ (Durandhar) 101 కోట్ల వసూళ్లు సాధించగా పుష్ప-2 50 కోట్ల వసూళ్లు సాధించింది.  దీనిని బట్టి దురంధర్ ఏ రేంజ్ హిట్ అనేది మనం ఊహించుకోవచ్చు

నార్త్ ఆడియన్స్ మళ్ళీ వెనక్కి వెళ్లి మసాలా ఎంటర్టైనర్ లను కోరుకుంటున్నట్లుగా ఉంది

పుష్ప-2 (Pushpa 2) అంత పెద్దగా హిట్ అవడానికి కారణాలు : 

  • ఆ నెలలో, వేరే ఇతర సినిమాల రిలీజ్ లు పెద్దగా లేవు. 
  • అల్లు అర్జున్ (Allu Arjun) రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ నార్త్ ఆడియన్స్ కు బాగా నచ్చడం
  • స్మగ్లర్ లు, డాన్ ల ను హీరో గా చూపించే ఫార్ములా – ఒక మామూలు వ్యక్తి సామాన్య స్థాయి నుండి శాసించే స్థాయికి వెళ్లడం –  మన పాత హిందీ హిట్ చిత్రాల ఫార్ములా
  • సీక్వెల్ కావడం – పుష్ప-1 హైప్ కొంత మేరకు కలిసి వచ్చింది.  తగ్గేదెలా డైలాగు బాగా ప్రాచుర్యం పొందింది.  అంతే కాకుండా పుష్ప-1 హిందీ చిత్రం టెలివిజన్ లో, ఓ టి టి ల లో బాగా ప్రాచుర్యం పొందింది
  • పాటలు, దేవి శ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం
  • హీరో, విలన్ ల మధ్య పోటా పోటీ సన్నివేశాలు, సంభాషణలు

సరిగా ఒక సంవత్సరం తరవాత అదే డిసెంబర్ 5 న సైలెంట్ గా విడుదలైన దురంధర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం విజయం సాధించింది.  అంతే కాదు పుష్ప 2 (Pushpa) రికార్డు ను బద్దలు చేసే దిశగా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకు పోతోంది

దురంధర్ ‘ఏ’ రేటింగ్ ఇచ్చిన సినిమా. గల్ఫ్ దేశాలలో మరియు పాకిస్థాన్ లో ఈ సినిమా విడుదలని నిషేదించారు. సీక్వెల్ అంత కంటే కాదు. పైగా సినిమా నిడివి సుమారు మూడు గంటల 40 నిమిషాలు.  పెద్ద పెద్ద స్టార్ లు ఎవరు లేరు.  ఈ చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ కు ఇది రెండవ సినిమా.  అయినా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1200 కోట్ల వసూళ్లు సాధించింది

దురంధర్ సినిమా కేవలం నటి నటుల నటన, సంభాషణలు, నేపధ్య సంగీతం, చక్కటి స్క్రీన్ ప్లే, దర్శకత్వం వంటి అంశాల వలన హిట్ అయ్యింది.  ఈ సినిమా చూసిన వాళ్ళందరూ బాగుంది అని ఆ నోటా ఈ నోటా చెప్పడం వలన సూపర్ హిట్ అయ్యింది

దురంధర్ (Durandhar) పార్ట్ 2 – రివెంజ్ ను మార్చ్ 19, 2026 న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బాషలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.