ఇండియా లోనే నెంబర్ వన్ హీరో ప్రభాస్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాజా సాబ్ ఈ సంక్రాంతికి కి థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్నాడు. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ గా రూపొందించారు.
దీని తరవాత ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక చితం చేస్తున్నాడు. అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం మాత్రం సందీప్ వంగా దర్శకత్వంలో వస్తోన్న స్పిరిట్. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు
న్యూ ఇయర్ సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. అంతే కాకుండా INDIAN CINEMA…. witness your AJANUBAHUDU / AJANUBAHU Happy New Year 2026 అని ఎక్స్ లో రాసుకొచ్చారు. ఈ ఫస్ట్ లుక్ లో ఒంటికి గాయాలైన ప్రభాస్ కి సిగరెట్ వెలిగిస్తున్న నటి ఉండగా, ప్రభాస్ చేతిలో మందు సీసా ఉంది. మాస్ ప్రేక్షకులను అలరించేలా ఈ ఫస్ట్ లుక్ ఉంది
ప్రభాస్ సినిమా ఒక మాదిరిగా ఉంటేనే వసూళ్ల వర్షం కురుస్తుంది. అదే యాక్షన్ సినిమా అందునా సందీప్ వంగా దర్శకుడు అంటే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.


