భారత, శ్రీలంక మహిళల జట్ల మధ్య జరుగుతోన్న ఐదవ టి 20 మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్ల లో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టును కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ సమోయిచిత ఇన్నింగ్స్ తో ఆడుకుంది. హార్మన్ ప్రీత్ కౌర్ 43 బంతుల్లో 68 పరుగులు చేసింది. హర్మాన్ కు తోడుగా అమన్ జోత్ కౌర్ 18 బంతుల్లో 21 పరుగులు, అరుంధతి రెడ్డి 11 బంతుల్లో 27 పరుగులతో కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ కు చక్కని సహకారం అందించారు
భారత జట్టు ఇన్నింగ్స్ ప్రారంభమైన దగ్గర నుండి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. అయితే ఆరవ వికెట్ కు హర్మాన్, అమన్ జోత్ లు 61 పరుగులు జోడించారు.
గత మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన షెఫాలీ వర్మ ఈ మ్యాచ్ లో 5 పరుగులు చేసి అవుట్ అయింది. స్మ్రితి మందన ఈ మ్యాచ్ ఆడలేదు. షెఫాలీ వర్మ తో కమలిని ఇన్నింగ్స్ ఆరంభించింది.
ఇప్పటికే భారత జట్టు 4-0 తో సిరీస్ గెలుచుకుంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉంది భారత జట్టు

