మన శంకర వర ప్రసాద్ గారు : మెగా విక్టరీ మాస్ సాంగ్ విడుదల

by | Dec 30, 2025 | సినిమా

మెగా స్టార్ చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ స్వర సారధ్యం వహిస్తున్నారు

ఇప్పటికే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం నుండి విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మూడవ పాటగా మెగా స్టార్ చిరంజీవి, విక్టర్ వెంకటేష్ కాంబినేషన్ లో ఉన్న పాటను ఈ రోజు విడుదల చేశారు. విజయ్ పోలాకి కోరియోగ్రఫీ చేశారు. ఈ పాట సంక్రాంతి పండగ వైబ్ తీసుకొచ్చేలా ఉంది

ఈ పాటను గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీ లో ఈ జనరేషన్ స్టూడెంట్స్ సమక్షంలో విడుదల చేశారు. ఈ పాట న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కు మంచి ఊపు ఇచ్చేలా ఉంది. రిలీజ్ టైమింగ్ కూడ పక్కాగా ప్లాన్ చేశాడు మన అనిల్ రావిపూడి

జనవరి 12 న మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. అనిల్ రావిపూడి ఈ పాటతో ప్రొమోషన్స్ మొదలు పెట్టారు. జనవరి 1 న నయనతార తో ప్రొమోషన్స్ మొదలు పెడుతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఇంకా చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లు వరసగా ప్లాన్ చేస్తున్నారు