పుష్ప 2 రికార్డు బ్రేక్ చేస్తాడా ?

by | Dec 28, 2025 | సినిమా

రణ్ వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, సారా అర్జున్ లు నటించిన హిందీ సినిమా దురంధర్ నాలుగవ శనివారం కూడా అక్షరాల 21 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

ఆదిత్య ధర్ ఈ దురంధర్ చిత్రానికి రచయిత, నిర్మాత, దర్శకుడు. ఆదిత్య ధర్ గతంలో ఉరి వంటి చిత్రానికి దర్శకత్వం వహించాడు. అతనికి ఇది రెండవ సినిమా మాత్రమే.

ఇప్పటికి దురంధర్, ఇండియాలో  706 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.  దురంధర్ ఊపు చూస్తే పుష్ప-2 రికార్డు బద్దలు అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.  పుష్ప-2 హిందీ వెర్షన్ 836 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. దురంధర్ ఊపు చూస్తే న్యూ ఇయర్ నాటికి 800 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు ఉన్నాయి

దురంధర్ వసూళ్లు ఎక్కడ ఆగుతాయో అని బాలీవుడ్ తో పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంత ఆసక్తి తో ఎదురు చూస్తోంది

 ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 2025 లో వెయ్యి కోట్ల క్లబ్ (గ్రాస్ ) లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా ‘దురంధర్’ రికార్డు సృష్టించింది.

ఒరిజినల్ హిందీ చిత్రాలలో అత్యధిక వసూళ్లు సాధించిన దురంధర్ ‘స్త్రీ-2 పేరిట ఉన్న రికార్డు ను బద్దలు కొట్టింది. పాకిస్థాన్, Gulf వంటి దేశాలలో ఈ సినిమాను నిషేధించినా, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఒక్క బాషలోనే 1000 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.

దురంధర్ పార్ట్ 2 – రివెంజ్ ను మార్చ్ 19, 2026 న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బాషలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.