రాజాసాబ్ కంటెంట్ మీద డార్లింగ్ ప్రభాస్ నమ్మకంగా లేడా!

by | Dec 28, 2025 | సినిమా

రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడుతూ ఫస్ట్ ప్రభాస్ హిందీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే అనిల్ తడానీ, తరవాత బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ గురించి మాట్లాడారు.  ఈ సినిమా నానమ్మ, మనవడి కధ అని డార్లింగ్ ప్రభాస్ చెప్పారు. 

గ్లామర్ విషయంలో ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు రిద్ది, మాళవిక, నిది ఉన్నారు.  అయినా సరే గ్లామర్ డోస్ తక్కువగానే ఉందని చెప్పాలి.  ఈ లోగా అభిమానులు అందరు ఒక్కసారి ‘బాహుబలి జయహో’ అంటూ నినాదాలు చేశారు.

ఈ సినిమాకు హీరో విశ్వ ప్రసాద్ గారు అని డార్లింగ్ ప్రభాస్ అన్నారు. మూడు సంవత్సరాలు సినిమా తీశాము.  అనుకున్న బడ్జెట్ ఒకటి అయిందొకటి.   ఏదో చేశారు, ఏదో రాశారు అని మారుతి ఉద్దేశించి అన్నారు.  ప్రభాస్ మాట్లాడుతూ నేను భయపడిపోయాను, నిర్మాత విశ్వ ప్రసాద్ గారు మాత్రం ధైర్యంగా ఉన్నారు.  అందుకే ఈ సినిమా హీరో విశ్వ ప్రసాద్ అని అన్నారు

హారర్ కామెడీ గా రూపుదిద్దుకున్న ఈ రాజా సాబ్ లో 15 సంవత్సరాలకు ముందు ప్రభాస్ ని మళ్ళీ చూపించాడు దర్శకుడు మారుతి.  ఈ సినిమాతో ప్రభాస్ మారుతీ రైటింగ్ కి ఫ్యాన్ అయిపోయానని చెప్పాడు

ఈ సినిమాలో ఉన్న క్లైమాక్స్ ఇప్పటి వరకు ఎవరు రాయలేదు అని అన్నాడు. క్లైమాక్స్ బావుంది అని మీరు చెప్పాలి,  నేను నా ఫీలింగ్ చెపుతున్నా అని ప్రభాస్ అన్నాడు.  15 సంవత్సరాల తరవాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు.  మరి చూస్కోండి. అది సంక్రాంతి కి అని అభిమానులను ఉద్దేశించి ప్రభాస్ అన్నాడు.

ఇంకా ప్రభాస్ మాట్లాడుతూ సంక్రాంతి సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి.  మాది కూడా బ్లాక్ బస్టర్ అయితే హ్యాపీ అన్నాడు.

ప్రభాస్ స్పీచ్ సింపుల్ గా ఉంది.  ప్రభాస్ మాటలు వింటుంటే, రాజా సాబ్ ఫైనల్ అవుట్ ఫుట్ ప్రభాస్ కి నచ్చలేదా అన్న సందేహం కలుగుతోంది.   రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేశారు.  అయితే ఇప్పటికి రిలీజ్ ట్రైలర్ ఇంకా విడుదల చేయలేదు.  అభిమానులు ట్రైలర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

ప్రభాస్ సినిమా అంటేనే మినిమం 500 కోట్లు, హిట్ అయితే 1000 కోట్లు, బ్లాక్ బస్టర్ హిట్ అయితే 1500 కోట్లు.  అయితే, ఈ సంక్రాంతి కి పోటీ చాలా గట్టిగానే ఉందని చెప్పాలి. మొత్తంగా ఏడు సినిమాలు విడుదలవుతున్నాయి.  రాజా సాబ్ తో పాటు మన శంకర వర ప్రసాద్ గారు, జన నాయకుడు, పరాశక్తి, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు వంటి చిత్రాలు జనవరి 9 నుండి 14 వరకు, అంటే ఆరు రోజులలో ఏడు చిత్రాలు విడుదలవుతున్నాయి.

సంక్రాంతి కి వచ్చిన సినిమాలను స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా సినిమా బావుంటే చిన్న సినిమా నైనా సూపర్ హిట్ చేస్తారు మన తెలుగు ప్రేక్షకులు

ఇండియాలోనే బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ సినిమా రాబోతోన్నరాజా సాబ్ సూపర్ హిట్ అవ్వాలని ప్రగడ టీవీ విషెస్ తెలియ చేస్తోంది.