బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం అఖండ 2. ఈ చిత్రం వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన హిట్ సినిమా అఖండ సినిమాకు సీక్వెల్. థమన్ స్వర సారధ్యం వహించిన ఈ సినిమాను రామ్ ఆచంట, గోపి ఆచంట లు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంనుండి హైందవం లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటను నాగ గురునాథ శర్మ రాశారు. సర్వేపల్లి సిస్టర్స్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సింగర్స్ శ్రేయ, రాజ్య లక్ష్మి లు ఈ పాట పాడారు
సనాతన ధర్మం బ్యాక్ డ్రాప్ లో ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి వస్తోన్న ఈ చిత్రం ఈ నెల (డిసెంబర్) 5 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను లకు అఖండ-2 తాండవం మొదటి పాన్ ఇండియా సినిమా.

