అఖండ 2 టికెట్ రేట్ల పెంపుకు, ప్రీమియర్ కు అనుమతి

by | Dec 2, 2025 | సినిమా

Akhanda 2 : భారీ టార్గెట్ తో బరిలో దిగుతోన్న బాలయ్య ; టికెట్ రేట్ల పెంపుకు, ప్రీమియర్ కు అనుమతి

Bala Krishna, Boyapati Srinu Combination Akhanda 2 : కొత్త సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం, ప్రీమియర్ షో లకు ప్రత్యేక రేట్లు పెట్టడం వంటివి సర్వ సాధారణమయ్యాయి.    బాలకృష్ణ నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రం అఖండ 2 ఈ నెల 5 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక రేట్లకు ఈ సినిమాను అమ్మినట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో అఖండ 2 సినిమా ప్రీమియర్ టికెట్ ధరలను 600 రూపాయలుగా నిర్ణయించారు.  గతంలో పుష్ప 2 ప్రీమియర్ టికెట్ ధర 900,  ఓ జి ప్రీమియర్ టికెట్ ధర 1000 రూపాయలు గా నిర్ణయించిన విషయం మనకు తెల్సిందే

అఖండ 2 టికెట్ ధరలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్రింది విధంగా నిర్ణయించారు.

సింగల్ స్క్రీన్ లో 75 రూపాయలు , మల్టీ ప్లెక్స్ లో 100 రూపాయలు రేట్లు పెంచుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది.  డిసెంబర్ 4 రాత్రి ప్రీమియర్ షో లకు అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ రేట్ 600 రూపాయలు.  రోజుకు ఐదు షోల చొప్పున పెంచిన టికెట్ ధరలు 10 రోజుల వరకు అనుమతి ఇచ్చారు. పెంచిన టికెట్ ధరలన్నీ GST తో కలిపి అని తెలియచేస్తున్నాము

అఖండ 2 బ్రేక్ ఈవెన్ కలవాలంటే సుమారు 200 కోట్లు వసూలు చేయాలి.  ప్రస్తుతం డివైన్ టచ్ ఉన్న సినిమాలకు నార్త్ లో ఆదరణ బాగానే ఉందని చెప్పవచ్చు.  బోయపాటి కూడా అదే దారిలో వెళ్లి సనాతన ధర్మం బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందించాడు

ఒక పక్క ఐ బొమ్మ రవి కి సోషల్ మీడియా మద్దతు, మరో పక్క టికెట్ రేట్లు, పాప్ కార్న్ రేట్లు తగ్గించాలన్న  డిమాండ్ లు వినపడుతుంటే మళ్ళీ ఇప్పుడు అఖండ 2 సినిమా ప్రీమియర్ టికెట్ రేట్లు 600 గా నిర్ణయించడం పట్ల ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.  ఏది ఏమైనా బాలకృష్ణ, బోయపాటి ల ముందు భారీ టార్గెట్ ఉంది.  ఈ టార్గెట్ ని అందుకోవాలంటే మొదటి నుండి సూపర్ పాజిటివ్ టాక్ రావాలి.